Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
టీఆర్ఎస్ జిల్లా నూతనఅధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ను శనివారం సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగయ్య నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అనంతుల శ్రీను, సర్పంచులు బిట్టు నాగేశ్వరరావు, చెన్ను శ్రీనివాసరెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్రఫీ, జిల్లా నాయకులు మామిడి అంజయ్య, ఇంద్రసేనారావు, పీఏసీఎస్ చైర్మెన్లు నాతాల జానకిరాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ భరత్, వెన్న సీతారాంరెడ్డి, మండల నాయకులు సముద్రాల రాంబాబు, గార్లపాటి స్వర్ణ పాల్గొన్నారు.