Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సంక్షేమాభివద్ధిలో సంచలనాలు సష్టించిన సీఎం కేసీఆర్
అ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల అభినందన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
మోడీ పాలనలో దేశమంతా దివాళా తీసిందని,నిరుపేదలు పెదలుగానే మిగిలి ఉన్నప్పటికి,దళారులను మాత్రం కుబేరులను చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.దళారులకు దోచి పెట్టడం, వారితో అంట కాగడం తప్ప,గుజరాత్ లో దారిద్య్ర రేఖ మరింత పెరిగిం దన్నారు.శనివారం పట్టణంలో టీఆర్ఎస్ జిల్లా నూతన అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అభినంద సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు దిక్కుమొక్కు లేదన్నారు.ఆ పార్టీని నడిపే ప్రధాన నాయకుడు ఎవరో ఆ పార్టీ నాయకులకే తెలియదని ఎద్దేవా చేశారు.అటువంటి పార్టీలో పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా అటువంటి పార్టీలు ప్రేలాపణలు మాని టీఆర్ఎస్ చేసే అభివద్ధిలో భాగస్వాములైతే ప్రజలు హర్షిస్తారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అన్నారు.అతన్ని ముట్టు కోవాలనుకునే చూస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైనా భస్మం అవుతారని విశ్వసించారు.కాళేశ్వరం కల సాకారం చేసిన ఏకైకనేత సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమం,అభివద్ధిలో సంచలనాలు సష్టించిన నాయకుడుగా కేసీఆర్ పేరొందారని వెల్లడించారు.ఫైరవీలు,దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉప్పలఆనంద్, గండూరి ప్రకాష్,మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,వ్యవసాయ కమిటీ చైర్మెన్ ఉప్పల లలిత ఆనంద్,మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, జెడ్పీటీసీ జీడి భిక్షం,పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, పెద్దగట్టు చైర్మెన్ కోడి సైదులుయాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.