Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశ రాజధాని ఢిల్లీలోని కస్తూర్భాలో మహిళపై సామూ హిక లైంగికదాడులు జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేస్తూ శనివారం ఐద్వా, డీవైఎఫ్ఐ మండలకమిటీల ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి మాట్లాడారు.ఢిల్లీలో 20 ఏండ్ల మహిళను ఇంట్లో నుండి ఎత్తుకెళ్లి ముగ్గురు యువకులు సామూహికలైంగికదాడికి పాల్పడడం దారుణమన్నారు.ఢిల్లీలో ఇలాంటి ఘోరమైన దాడులు జరగడం శోచనీయమన్నారు.నిరంతరం మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్న పాలకులు మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.మహిళా రక్షణచట్టాలను పటిష్టంగా అమలుచేయాలని, రక్షణచర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు దొడ్ల ఆండాలు, బత్తుల జయమ్మ, ఎమ్‌డి.రేష్మ, బండారు సోని, భావండ్లపల్లి సునంధ, బొంగు వసంత, ఆకుల యాదమ్మ, సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ నాయకులు ఎమ్‌డి.పాషా, బండారు నర్సింహ, ఆకుల ధర్మయ్య, సామిడి నాగరాజురెడ్డి, ఎమ్‌డి.ఖయ్యుమ్, దేప రాజు పాల్గొన్నారు.