Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉద్యోగులకు సంకటంగా మారిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు.శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.317 జీవోను అడ్డం పెట్టుకుని ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.ఈ జీవో ద్వారా రాష్ట్రంలో ఉద్యోగులందరికీ తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.బీజేపీ,టీఆర్ఎస్లు జీవోపై కుట్రపూరితంగా నాటకాలాడుతున్నాయన్నారు.యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణాలో మళ్ళీ ఆత్మహత్యలు వద్దని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర అభివద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేసి విజయవంతం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు .నిరుద్యోగులెవ్వరూ అధైర్య పడకుండా ఉండాలని,ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.