Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కంచర్ల రామకష్ణారెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామియాదవ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందర్ని సమన్వయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భువనగిరి జెడ్పీటీసీ సుబ్బురు బీరుమల్లయ్య, వైస్‌ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య,ఎంపీటీసీలు సామల వెంకటేష్, బొక్క కొండల్ రెడ్డి,రాసాల మల్లేష్‌యాదవ్,రాంపల్లికష్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శెట్టి బాలయ్యయాదవ్, వెంకటస్వామియాదవ్ పాల్గొన్నారు.