Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతు పంటలపై గ్యారంటీ చట్టం చేయాలి
అ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతు పండించిన పంటలపై గ్యారంటీ చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ ఈనెల 31న చేపట్టే నిరసనను జయప్రదం చేయాలని శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెపేందుకు మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారని ఆరోపించారు. రైతు ఉద్యమాలు తట్టుకోలేక చట్టాలు తాత్కాలికంగా రద్దు చేసుకున్నారని, మళ్ళీ చట్టాలు తెచ్చే అవకాశం ఉందని చెప్పారు. చట్టాలు శాశ్వతంగా రద్దు అయ్యేంత వరకు బలమైన ఉద్యమాలు చేయాలని కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో పంటలపై గిట్టిబాటు ధర ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్లు, సీట్లు కొనుకొన్న కార్పొరేట్ శక్తులు పాలన చేస్తున్నారని, అందుకే ప్రజల ఆస్తులన్నీ ప్రవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పారు. రాజకీయ పార్టీలకు కన్సల్టెంట్స్ వచ్చాయని అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలో పెడతారని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను వెలికితీసి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ బలోపేతంకు పాటుపడాలని సూచించారు. 31న జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు తరలిరావాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చౌగాని సీతారాములు, ఐద్వా, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పోలేబొయిన వరలక్ష్మి, రవి నాయక్, కేవీపీఎస్ నాయకులు రేముడల పరుశురాములు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగరెడ్డి, ఆయూబ్, ఎండీ.అంజాద్, తిరుపతి రామ్మూర్తి, పాల్వాయి రాంరెడ్డి, బాలసైదులు, సైదులు, కోటిరెడ్డి, లక్మినారాయణ, రాంచంద్రు, గోవింద్ రెడ్డి, పాతని శ్రీనివాస్, రామారావు, వెంకటయ్య, మాధవరెడ్డి పాల్గొన్నారు.