Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల లోకల్ క్యాడర్ వ్యవస్తీకరణలో భాగంగా తెచ్చిన ఆశాస్త్రీయమైన 317 జీఓతో నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీన్యాయం చేసే వరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పోరాడుతుందని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు.అన్ని రకాల అప్పీళ్లను వెంటనే పరిష్కారించాలని,భార్య భర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని,స్థానికత కోల్పోయిన ఉద్యోగులను,ఉపాధ్యాయులను నియమిత కాలంలో తమ సొంతజిల్లాలకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్,టీపీటీఎఫ్,డీటీఎఫ్ నాయకులు సీహెచ్.రాములు, ఎస్.అనిల్‌కుమార్, వి.ప్రభాకర్,రేపాకలింగయ్య,టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ధర్మార్జున్, సీఐటీయూ నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ నాయ కులు చకిలం రాజేశ్వర్‌రావు కార్యక్రమానికి హాజరై వారికి సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్. సోమయ్య, సీహెచ్.భిక్షం, బొల్లెద్దు వెంకటేశ్వరరావు, దశరథరామారావు, రామ నర్సయ్య, సీహెచ్. వెంకటేశ్వర్లు, పబ్బతి వెంకటేశ్వర్లు, సుభాని, వెంకయ్య, వీరన్న, వీరారెడ్డి, ఆనంద్ భాస్కర్, యోగానంద్, యాకయ్య,క్రాంతి కుమార్,శౌరీ,సిద్దిఖ్ పాషా, వేణు,రమణ, ప్రభాకర్,సింహాద్రి,స్వాతి,నాగేంద్ర,సరిత, రాధ,చంద్రశేఖర్,లింగరాజు,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ:ఉపాధ్యాయులకు నష్టం కలిగించే జీవో 317ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట చమితి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. వీరారెడ్డి, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా కార్యదర్శి నాగార్జున, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడారు. 317 జీవో సమస్య లపై ఉపాధ్యాయ సంఘాలతో సీఎం చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 317ను సవరించాలని స్థానికతను కోల్పోయిన జూనియర్లకు న్యాయం చేయాలని, జిల్లా కేటాయింపులో జరిగిన అవకతవకలు, సీనియార్టీలో దొర్లిన పొరపాట్లను భార్యాభర్తలు, వితంతువులు, వికలాంగులు తదితరులకు పరిష్కారం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నశించాలన్నారు. స్థానికత ఆధారంగానే అలకేషన్ చేసి ఏ ఒక్క టీచర్‌కు అన్యాయం జరగకుండా అన్ని సమస్యలు పరిష్కరించాని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గత నెల రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఊదాసీనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు. ఉద్యోగులకు గుదిబండగా తయారైన 317 జీవోను పూర్తిగా రద్దు చేసి కొత్త జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.