Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ఇటీవల మండల పరిధిలోని పెదనేమిల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు గుండగాని మధు తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు.శనివారం తక్షణ సహాయంగా తాడి కార్పొరేషన్ నుండి మంజూరైన రూ.25,000 చెక్కును తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ అభివద్ధి అధికారిని జి. అనసూయ,బీసీ సంక్షేమ సంఘం డివిజన్ అధికారి మాధవరెడ్డి మతుని భార్య సరితకు అందజేశారు.అనంతరం బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విషయం తెలియగానే వెంటనే స్పందించి సహకరించిన కార్పొరేషన్ చైర్మెన్,బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్,,ఎక్సైజ్ శాఖ మాత్యులు వి. శ్రీనివాస్‌గౌడ్,కార్పోరేషన్ ఎండి.ఉదరు ప్రకాష్ ,కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణలకు కుటుంబసభ్యులు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ నుండి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఉయ్యాల నగేష్, మండల అధ్యక్షులు మొగుళ్ళ వెంకన్న, స్థానిక సొసైటీ అధ్యక్షులు గుండగాని రమేష్, తదితరులు పాల్గొన్నారు.