Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మహబూబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల సాగర్ ఇటీవల కాలంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదని కలత చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఘనస్వాగతం పలికారు.స్థానిక రాజకీయ పరిస్థితి వివరాలను కాంగ్రెస్ మండలఅధ్యక్షులు ఎలిసోజ్ నరేష్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షులు కందుకూరు అంబేద్కర్, కాంగ్రెస్ మండలఅధ్యక్షులు కందుకూరి విశ్వేశ్వర్, ఎస్సీసెల్ మండలఅధ్యక్షులు కందుకూరి కష్ణ, నాయకులు ఫత్తేపురం సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కంబాల రాకేష్, తరుణ్,రఫీ, ఉమేష్, రషీద్ పాల్గొన్నారు.