Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాల :సాగర్ ఎడమకాలువలో పడి బాలుడు మతి చెందిన ఘటన మునగాల సమీపంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు తిరుపతమ్మ మాల వేసుకున్నారు.మండలంలోని బరాఖత్‌గూడెం వద్ద తిరుపతమ్మ దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటామని తల్లిదండ్రులతో చెప్పి ఇక్కడికి వచ్చారు.దేవాలయం వద్ద స్నానానికి అనువుగా లేకపోవడంతో మునగాల సమీపం గల సాగర్ కెనాల్లో స్నానం చేసేందుకు వచ్చారు.స్నానం చేస్తున్న సమయంలో తాటి సుందర్‌కుమార్ (15) ప్రమాదశాత్తు కాలుజారి కాలువలో పడి మతి చెందాడు.మతుని స్నేహితులు ఉమేష్, శ్రీకష్ణ బాటసారులకు విషయం తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఖమ్మం వైపు వెళ్తున్న కాలువ షట్టర్ల కిందికి దించి మతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.గజ ఈతగాళ్ళ సహాయంతో సాయంత్రానికి బాలుడి శవం బయటకు తీసుకొచ్చారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.