Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ వన్‌టౌన్ సీఐగా రౌతు గోపి శనివారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ వి.బాలగోపాల్ హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావడంతో ఆ స్థానంలో నల్లగొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న గోపిని నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానన్నారు.మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్ఐలు నరేష్, శంకరయ్య, లక్ష్మీనర్సయ్య, లచ్చిరెడ్డి సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని సీఐ మర్యాదపూర్వకంగా కలిశారు.