Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా నిలబడతానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా అధ్యక్షునిగా నియమితులై దేవరకొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పట్టణంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లా డుతూ...జిల్లాలో బూత్ స్థాయి నుంచి గ్రామ, పట్టణ, మున్సిపల్ స్థాయిల వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే ముందున్న లక్ష్యం అన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఇతర పార్టీలు లేవన్నారు. టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, సంక్షేమ పార్టీ అని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన పార్టీ వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ అధ్యక్షులు కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, మార్కెట్ చైర్మెన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, మాధవరం సునీతా జనార్ధన్‌రావు, బాణావత్ పద్మ హన్మనాయక్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, బాలునాయక్, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింత పల్లి సుభాష్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, హన్మంత్ వెంకటేష్ పాల్గొన్నారు.