Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రియుడి మోజులో భర్తను భార్య చంపిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ పట్టణపరిధిలోని పానగల్లులో చోటు చేసుకుంది.టూటౌన్ ఎస్ఐ రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పానగల్లుకు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (41) వడ్డెర పని చేసుకొని జీవిస్తున్నాడు ఇతని భార్య ఇరగదిండ్ల సుజాత నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన కప్ప లింగస్వామితో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఏర్పాటు చేసు కుంది.దీంతో వీరిద్దరి మధ్య వెంకన్న అడ్డుగా ఉన్నాడని భావించిన సుజాత భర్త వెంకన్న ఇంట్లో నిద్రపోతుండగా తెల్లవారు జామున అతడి కాళ్లను గట్టిగా పట్టు కుంది.లింగస్వామి మృతుని మొహంపై దిండుతో గట్టిగా నొక్కడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సుజాత తన ప్రియునితో కలిసి గతంలోనూ వెంకన్నను హత ూర్చేందుకు ప్రయత్ని ంచినట్టు పోలీసులు పేర్కొ న్నారు. మృతుని తండ్రి భిక్షమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.