Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు మిషన్‌భగీరథ నీరంది ంచకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి హెచ్చ రించారు. ఆదివారం పురపాలక కేంద్రంలో ఏర్పాటుచేసిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల ఆసక్తి చూపిస్తున్నారన్నారు.పోచంపల్లి మండలం సభ్యత్వ నమోదు జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలని కోరారు.కలుషితమైన నీరు తాగడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మిషన్ భగీరథ ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు తాగునీరు అందిం చలేని పరిస్థితి టీఆర్ఎస్ది అన్నారు.దీంతో ప్రజలు తాగు నీటిని కొనుక్కుంటున్నారన్నారు. ఆచార్య వినోభా బావే భూదాన ఉద్యమానికి నాంది పలికి నేడు చేనేత వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లికి అరుదైన ఘనత వరల్డ్ బెస్ట్ టూరిజం రావడం అదష్ట మన్నారు.ప్రజలు కలుషితమైన వాటర్ తాగడం వల్ల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి ఆదివారం పదో ార్డులో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాక మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షులు తడాకా వెంకటేశం, మధు సూదన్‌రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, అనిరెడ్డి జగన్‌రెడ్డి, గుణగంటి వెంకటేశం, ఉప్పునూతల వెంకటేశం పాల్గొన్నారు.