Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతపల్లి
నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నియమితులైన సందర్భంగా చింతపల్లి మండల ంలోని మాల్ గోడుకొండ్ల టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీని నిర్వహించారు. కురుమేడు మీదుగా చింతపల్లి వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్రెడ్డి, మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ అండేకార్ అశోక్, కుంభం శ్రీశైలం గౌడ్, బొడ్డు గోపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ నాది రమేష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు చాంద్ పాషా పాల్గొన్నారు.