Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మునగాల
మండలంలోని నర్సింహులగూడెంకు చెందిన మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) నాయకులు జూలకంటి పులీందర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు .ఆదివారం నర్సింహులగూడెంలో పులీందర్‌రెడ్డి 8వ వర్థంతిని పార్టీ శాఖ కార్యదర్శి నందిపాటి శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులీందర్‌రెడ్డి నరహంతక కాంగ్రెస్ గూండాల చేతిలోఅతి దారుణంగా హత్య గావించబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాభివద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న నాయకులను హత్య చేయడం దుర్మార్గమన్నారు.ప్రజా నాయకులను అంతమొందించినంత మాత్రాన ఎర్రజెండా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.గ్రామంలో పేదలు,వ్యవసాయ కూలీలు, రైతుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించడంలో ఆగ్రభాగాన ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కొంత మంది దుర్మార్గులు తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తమ పార్టీ నాయకులను అతిదారుణంగా కత్తులు, గొడ్డళ్ళతో నరికి చంపడం అన్యాయమన్నారు.అమరవీరుల స్పూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ పెట్టుబడిరులకు రాయితీలు కల్పిస్తుందని విమర్శించారు.దేశ సంపద అంబానీ,ఆదాని వంటి పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతుందని విమర్శించారు.దేశంలో రైతులు మద్దతు ధరల కోసం పోరాడుతుంటే పట్టించుకునే వారే కరువయ్యారన్నారు.యువతకు ఉద్యో గ ఉపొధి అవకాశాలు కరువయ్యాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మండలకార్యదర్శివర్గసభ్యులు జూలకంటి కొండారెడ్డి, జూలకంటి విజయలక్ష్మీ, మండల కమిటీ సభ్యులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, సుంకర పిచ్చయ్య, నందిపాటి వెంకయ్య, నాయకులు పిడమర్తి అబ్రహం, దేశిరెడ్డి జ్యోతి నాగయ్య, శాఖ కార్యదర్శి మారం వెంకటరెడ్డి, బొంతసైదిరెడ్డి, కిరణ్, భగత్‌సింగ్, మంగతాయి, కిరణ్, బొంత స్వరూప,సత్యనారాయణ, రమేష్, సోమయ్య నారాయణ, వెంకటేశ్వర్లు, కాటం రాజు, శేఖర్, సాగర్, సుందరయ్య, లక్ష్మమ్మ, లచ్చిరెడ్డి, వీరస్వామి, హుస్సేన్ పాల్గొన్నారు