Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య
నవతెలంగాణ-రామన్నపేట
రాష్ట్రంలోని దళితులందరికీ ఏకకాలంలో రైతుబంధు అమలు చేయాలని, నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున అమలు చేసుకుంటూ పోతే 20 ఏండ్లైనా దళితబంధు పథకం లబ్దిదారులకు చేరదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆరోపించారు.మండలకేంద్రంలో అధివారం కాంగ్రెస్ సభ్యత్వ నమోదును ఆయన పరిశీలించి మాట్లాడారు.సీఎం కేసీఆర్‌కు ముందు మురిపించడం తర్వాత మర్చిపోవడం ఆయన సహజ లక్షణమన్నారు.తమ పార్టీ హయాంలోనే పేదలకు సంపూర్ణ లబ్ది చేకూరిందన్నారు.నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధికంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేయనున్నామన్నారు.ఈనెల 25 న ప్రారంభమైన సభ్యత్వ నమోదు 200తో ప్రారంభమై నేడు ఐదు వేలకు చేరుకుందన్నారు.రోజుకు మూడు వేలు సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు.వచ్చే నెల 9 వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని తెలిపారు.రాష్ట్రంలోనే నకిరేకల్ నియోజకవర్గం నుండి అత్యధికంగా నమోదు చేసి చూపిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుండా జలంధర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, పట్టణ అధ్యక్షులు ఎండి జమీరోద్దీన్,నాయకులు బోడ స్వామి, గుర్కు శివ, గాదె రాము, మేడి ఎల్లయ్య, మేడి శంకర్, మహమ్మద్ఎజాజ్, జానీ, అశోక్, మహబూబ్ అలీ పాల్గొన్నారు.