Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని సీతారాంపురంలోని వాసవిభవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీఐపీ హెయిర్ సెలూన్ షాపును యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ నల్లమోతు సిద్ధార్థ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వయం ఉపాధి పొంది ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిదళ్ల సత్యవేణి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు షేక్ జావిద్, కోటేశ్వర్ రావు, గయాజ్, ఇస్మాయిల్, సలీం, ఉస్మాన్, జాని, మహమూద్, సుధాకర్, కార్తీక్, నిర్వాహకులు రహీం, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.