Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరి(సాగర్)
బోయగూడెం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బోయగూడెం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం మొదటిసారిగా తన సొంత గ్రామమైన బోయగూడెంకు రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామంలో పండుగను తలపించేలా కోలాట ప్రదర్శన, నృత్యాలతో గ్రామ వీధుల్లో ర్యాలీగా తీసుకెళ్లారు. కార్యకర్తలు, అభిమానులు గ్రామ నడిబొడ్డున క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం స్థానిక పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా పలువురు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి న్యాయవాది, రాజకీయాల్లో నిబద్ధతో ఎదిగిన కోటిరెడ్డి జీవితాన్ని కొనియాడారు. అదే విధంగా గ్రామస్తులు, అభిమానులు పెద్ద ఎత్తున సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో పుట్టినవాడిగా ఇక్కడి సమస్యలు తనకు తెలుసన్నారు. సాగర్ కాల్వకి గ్రామం చివరన ఉండటంతో సాగునీటికి ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతలామని హామీ ఇచ్చారు. గ్రామంలో 6 ఎకరాల్లో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పుట్టిపెరిగి వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను శాలువాలు, పూలమాలతో స్వయంగా సన్మానించారు. అనంతరం సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడా జట్లకు ఆయన బహుమతులను అందించారు. కార్యక్రమంలో సునీత, ఎంపీపీ అంగోతు భగవాన్నాయక్, జెడ్పీటీసీ అంగోతు సూర్య బాష్యానాయక్, సర్పంచ్ నెమలి సునీత కృష్ణారెడ్డి, శాగం రాఘవరెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు పుట్లూరు రాజశేఖరరెడ్డి, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు జటావత్ జయరాం నాయక్, తహశీల్దార్లు మందడి నాగార్జునరెడ్డి, నెమలి అంజిరెడ్డి, కేవీ రామారావు, అల్లిపెద్దిరాజు నాగమణి, మన్నెం రంజిత్ యాదవ్ , చెన్నుసుందర్ రెడ్డి, ఆవుల పురుషోత్తం పాల్గొన్నారు.