Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిటౌన్
రూ.5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 27 నుండి తలపెట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని రెడ్డి జాగతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భుట్టంగారి మాధవరెడ్డి కోరారు.ఆదివారం స్థానిక దీప్తి కాన్ఫరెన్స్ హాల్లో ఫిబ్రవరి 27న ఉప్పల్ నుండి జనగామ వరకు నిర్వహించే పాదయాత్ర వాల్‌పోస్టర్ ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.మార్చి 6న పాదయాత్ర ముగుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కొట్టం మధుసూదన్‌రెడ్డి, మేక సోమిరెడ్డి, ఏనుగు సురేష్‌రెడ్డి, మొగుళ్ల అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి, గోలి వెంకట్‌రెడ్డి, విద్యారెడ్డి, లక్ష్మీరెడ్డి, మనోహర్‌రెడ్డి, పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, బోగిరంపేట కొండల్‌రెడ్డి, భీమిడి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.