Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్ :నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-83 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆ పాఠశాలకు సోమవారం విరాళం అందజేశారు. రూ.70 వేలు విలువచేసే 100 బెంచీలు, 5 గ్రీన్ బోర్డులు పాఠశాల ప్రధానో పాధ్యాయులు పోతుల గోపాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు పాఠశాలకు విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు యాతాకుల అంజయ్య, కిషన్‌రావు, వీర్లపాటి శ్రీనివాసులు, ఎస్కే హుస్సేన్, కోట మల్లయ్య, కోటగిరి శ్రీనివాస్, ఎస్కే.సలీం, గుండు దామోదర్, సత్యనారాయణ పాల్గొన్నారు.