Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్రంపోడు:గుర్రంపోడు మండలంలో ఏపీఓగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ ఇటీవల చండూరు మండ లానికి బదిలీ అయిన సందర్భంగా సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు ఏపీవో శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్ర మంలో ఎంపీడీవో సుధాకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రావులపాటి భాస్కర్, స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, సర్పంచులు షాహీన్ మదార్శ, బద్రి యాదయ్య, టీఆర్ఎస్ మండల రైతు విభాగం అధ్యక్షులు కుర్మారెడ్డి, యువజన అధ్యక్షులు కుప్ప పథ్వీరాజు పాల్గొన్నారు.