Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలో పటిష్టమైన భద్రతా లక్ష్యంగా అన్ని మార్గాలు,కాలనీల్లో 300 పైగా సీసీనిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు.అనంతరం మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రధానకేంద్రాలు, ప్రధాన కూడళ్లలో, పట్టణంలోకి అన్ని మార్గాలు,కాలనీలు, వార్డులు మొత్తం విస్తరించే ఏర్పాటు చేసి కేంద్రాన్ని సురక్షిత కేంద్రంగా మార్చాలని కోరారు.గతంలో చోటు చేసుకున్న నేరాల ఆధారంగా,పలు నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా దష్టి సారించాలన్నారు. అసాంఘీక చర్యలు, డ్రగ్స్ సరఫరా లాంటి వాటికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలన్నారు.కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా ప్రజలు,వ్యాపారులు సీసీ కెమెరా ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న సీసీ నిఘా కెమెరాలు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న కెమెరాలు మొత్తం అనుసంధానం చేయడం కోసం పట్టణంలో 70 కిలోమీటర్ల వరకు ఫైబర్ఆప్టికల్ సీసీ కెమెరా కేబుల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ పట్టణ మ్యాప్‌పై ఎస్పీకి వివరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఆంజనేయులు,మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి,మున్సిపల్ పట్టణ ఇంజనీరు,సీసీ కెమెరా ఏర్పాటు సంస్థ సిబ్బంది, పోలీస్ టెక్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.