Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపి జిల్లాలో గంజాయి, గుడుంబా, గుట్కా రహిత జిల్లాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గంజాయిని వినియోగిస్తున్న వారిపై, ఉత్పత్తి, సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలని, విచారణ దర్యాప్తులో ఉన్న కేసులను త్వరగా ఛేదించాలని పేర్కొన్నారు. గ్రామ పోలీస్ అధికారులు తమ గ్రామాలకు కేటాయించిన గ్రామాలు, పట్టణాలలో ఇండ్ల దగ్గర పంట పొలాలలో గంజాయి మొక్కలు దొరికితే సంబంధికులపై పీడీ యాక్టు నమోదు చేయాలని సూచించారు. అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు, పీపీలను సమన్వయం చేస్తూ విచారణ జరిపేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గంజాయిని అరికట్టడంలో కృషి చేసిన పోలీస్ అధికారులకు ప్రత్యేక రివార్డ్‌ను అందజేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.