Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కృష్ణారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.విష్ణుదేవ్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఈసీ మెంబర్ డాక్టర్ కె.అంజిరెడ్డి , డాక్టర్ శ్రీదేవి, ఫ్యాకల్టీ డాక్టర్ అల్వాల రవి, డాక్టర్ మిరియాల రమేష్, పీఆర్వో డాక్టర్ పీవీ శశిధర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఏఆర్ మాధవి, ఫైనాన్స్ ఆఫీసర్ నీలేష్ కుమార్ పాల్గొన్నారు.