Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కెేటీఆర్ అన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్, పురపాలక శాఖ అధికారులతో సోమవారం హైదరాబాద్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. సంబంధిత జీవోను స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కి అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు నల్లగొండ పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగలపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు గ్రామా లను కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) గా మారుస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అలాగే పట్టణంలో రోడ్ల విస్తరణకు విడుదల చేసిన నిధుల జి ఓ లను మంత్రి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కేంద్రం సమగ్ర అభివృద్ధి కోసం వేగంగా ముందుకు కదలాలని సూచించారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ తరచుగా జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొనే అధికారులు ప్రజలు ఆమోదం తెలిపే విదంగా నివేదికలు రూపొందించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎంఏ సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఈఎస్సీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఈఈ పబ్లిక్ హెల్త్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.