Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూరు
మండలంలోని కలిమెర గ్రామంలో సోమవారం మాజీ సర్పంచ్ గుంటకండ్ల సత్తిరెడ్డి 16వ వర్థంతిని ఆయన కుమారుడు గుంటకండ్ల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహి ంచారు.సత్తిరెడ్డి విగ్రహానికి ఆయన సతీమణి గుంటకండ్ల కమలమ్మ, సర్పంచ్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సత్తిరెడ్డి సర్పంచ్‌గా పని చేసిన కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే వారని గుర్తు చేసుకున్నారు.ఆయన ఆశయసాధనకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటాచారి,తండు గిరి, ఏరు చంద్రయ్య, గడ్డం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.