Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో పట్టణాన్ని అంచెల ంచెలుగా అభివద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ వెల్లడించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆమె అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్పటేల్తో కలిసి మాట్లాడారు. మున్సిపల్ చట్టం సెక్షన్ -26 ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ పంపే పనులకు పరిపాలన ఆమోదం ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉందన్నారు.ఆమోదం విషయాన్ని కౌన్సిల్‌కు సమాచారం నిమిత్తం తెలుపుతామన్నారు. పట్టణాభివధికి సహకరిం చాల్సిన ఆవశ్యకత జిల్లా అధికారులుగా మాపై ఉందన్నారు.కౌన్సిల్లో పొందుపరిచిన 10 అంశాలను ఆమోదిం చామన్నారు.అనంతరం జరిగిన జీరో అవర్‌లో 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో శివరాత్రి జాతర పిల్లలమర్రిలో ఉన్నందున ప్రజల సౌకర్యార్ధం ఎన్‌హెచ్ 65 నుండి పిల్లలమర్రి డొంక రోడ్డు నందు కంపచెట్లు తొలిగించి ప్యాచ్ వర్క్ చేయించాలన్నారు.రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టు గుంతను పూడ్చివేయించాలన్నారు.14వ వార్డు కౌన్సిలర్ పగిళ్ల సుమిలారెడ్డి మాట్లాడుతూ వార్డులో ఉన్న ఖాళీ స్థలాల వారికీ నోటీసులి వ్వాలన్నారు.రోడ్లు,మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.15 వ వార్డు కౌన్సిలర్ ఎలిమినేటి అభినరు మాట్లాడుతూ కొత్త బస్టాండ్ నుండి కుడకుడ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతు న్నామన్నారు.రోడ్డు వెంట మురికి కాలువ నిర్మాణం చేయాలని,వార్డు పరిధిలో గుంతలు పడిన మట్టిరోడ్లకు నిధులు మంజూరు చేయాలని సమావేశం దృష్టికి తెచ్చారు.46 వ వార్డు కౌన్సిలర్ కట్కూరి కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ 60 ఫీట్రోడ్ నందు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు.48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న మాట్లాడుతూ పట్టణంలో మాములు వ్యక్తి మరణిస్తే అట్టి దహన సంస్కారాలకు రూ.25,000 పైగా వసూలు చేస్తున్నారని, పేదవాడు చనిపోతే దహన సంస్కారాలు చేయడం ఇబ్బందిగా ఉందన్నారు.42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ మాట్లాడుతూ గణేష్‌నగర్,నిర్మల హాస్పిటల్ వెనుక వర్షమొస్తే నీరు పోని పరిస్థితి ఉందన్నారు.నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరాపార్క్ వద్ద లీకేజీ కోసం తీసిన గుంతను పూడ్చాలన్నారు.41వ వార్డు కౌన్సిలర్ షఫీవుల్లా మాట్లాడుతూ అన్నాదురై నగర్ నందు 25 ఏండ్ల కింద వేసిన రోడ్లు డ్యామేజ్ అయిన వాహన, పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని, రోడ్డుపై మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 26 ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ానున్న బడ్జెట్‌కు వార్డులలో నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పెద్ద మేదర్లతో మాట్లాడి మరణించిన వారి దహనసంస్కారం నిమిత్తము రేటు ఫిక్స్ చేయిస్తామన్నారు.పైప్‌లైన్ పనులను పూర్తి చేయిస్తామన్నారు. విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరా మిషన్ భగీరథ కోసం రూ.13.00 కోట్లకు 70 కిలోమీటర్లకు మంత్రి ఎస్టిమేషన్ వేయించి ప్రభుత్వానికి పంపుతామన్నారు.ఈ సమావేశంలో వైస్‌చైర్‌పర్సన్ పుట్టకిషోర్, కౌన్సిలర్లు, మున్సిపల్ ఈ ఈ జీకేడీ.ప్రసాద్ పాల్గొన్నారు.