Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో గ్రామాలభివద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు,అధికారులు ముందుండాలని జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అన్నారు.సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహించిన గ్రామీణాభివద్ధి,విద్యా, వైద్యంపై 2వ, 4వ స్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు.సూర్యాపేట ఏరియా స్పత్రి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ప్రభుత్వం అనేక వసతులు కల్పించిందన్నారు.కార్పొరేట్ హాస్పి టల్‌కు వెళ్ళి పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.మత్తు పదార్థాల తయారీ, సరఫరా విధానాన్ని గ్రామస్థాయిలోనే అడ్డుకోవాలన్నారు.నూతనకల్ జెడ్పీటీసీ కె.దామోదర్‌రెడ్డి, మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో మరుగుదొడ్లు ఉపయోగంలో లేకపోవడంతో సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.డ్రయినేజీ సిస్టమ్‌ను సరి చేయాలని సూచించారు.నేరేడుచర్ల జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య మాట్లాడుతూ నేరేడుచర్ల పీహెచ్సీలో అదనపు గదులు ఏర్పాటు చేయాలన్నారు.మండలంలో గంజాయి క్రయవిక్రయాలు జరపకుండా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి యువతకు అవగాహన కల్పించాలన్నారు.ఈ సమావేశంలో గరిడేపల్లి జెడ్పీటీసీ పోరెడ్డి శైలజ, జెడ్పీ సీఈఓ సురేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.