Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండల ఎంపీపీ పల్లె కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న ఆరోపించారు. సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 27న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండలంలో 18 గ్రామా లలో స్వయంగా వచ్చి ఇంటిం టికి తిరిగి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తానని చెప్పి వాయిదా వేయడంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు దోటి వెంకటేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంత చంద్ర శేఖర్‌గౌడ్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు భూతరాజు అంజనేయులు, కళ్లెట్లమారయ్య, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఈరిగి రాజు పాల్గొన్నారు.