Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేట
నూతన కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన గోదాములోకి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తరలించామని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు.సోమవారం స్థానిక వ్యవసాయమార్కెట్ గోడౌన్లో గల ఎలక్షన్ పిటిషన్లో లేని బ్యాలెట్ యూనిట్స్ 1288, కంట్రోల్ యూనిట్లు 44, వీవీ ఫ్యాట్స్ 1332 మొత్తం 2664 గల ఎన్నికల పరికరాలను కుడకుడలోని నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన ఈవీఎంల గోదాంలోకి ఆర్టీసీ డీజీటీ బస్సులో పోలీస్ బందోబస్తుతో పకడ్బందీగా తరలించామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాజేంద్రకుమార్,ఆర్డీఓలు కోదాడ కిషోర్‌కుమార్, హుజూర్నగర్ వెంకారెడ్డి,ఏఓ శ్రీదేవి, తహసీల్దార్ వెంకన్న,ఎలక్షన్ డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు.