Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనవరి 31ని విద్రోహదినంగా ప్రకటించాలని ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని, వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐఎంఎల్న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, తెలంగాణ జన సమితి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి కుంట్ల ధర్మార్జున్, సీపీఐ జిల్లా నాయకులు దంతాలరాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం జనవరి 31ని దేశవ్యాప్త విద్రోహదినంగా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్సెంటర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లేఖలోని వాగ్దానాలలో ఏ ఒక్క హామీని కూడా కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించు కుంటామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం,మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసు కోలేదన్నారు.హర్యానా ప్రభుత్వం కొన్ని మాత్రమే అమలు చేసింన్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి లేఖ కూడా అందలేదన్నారు.అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.నష్టపరిహారానికి సంబంధించి ఎంత మొత్తం ఉంటుంది, ఏ పద్ధతిలో ఇవ్వబడుతుందన్న విషయాలపై హర్యానా ప్రభుత్వం ప్రకటన చేయలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు.కనీస మద్దతు ధర సమస్యపై, ప్రభుత్వం కమిటీ ఏర్పాటును ప్రకటించలేదన్నారు.కమిటీ స్వభావం, దాని విధానాలను గురించి సమాచారం ఇవ్వలేదన్నారు.ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఆరుట్ల శంకర్‌రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరినర్సయ్య,ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుంజలూరు కోటయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి,ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, డీివైఎఫ్‌ఐ నాయకులు జిల్లాపల్లి నర్సింహారావు, పీవైఎల్ కార్యదర్శి కునుకుంట్ల సైదులు,పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పోలేబోయిన కిరణ్, తెలంగాణ రైతుసంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత,మందడిరాంరెడ్డి, నారాయణ, వీరారెడ్డి, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు మాండ్ర మల్లయ్య యాదవ్, బంధన్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, నాయకులు రామన్న , రామోజీ,కాకి మోహన్‌రెడ్డి, షేక్ సయ్యద్,నాగిరెడ్డి, శేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.