Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ, మాడుగులపల్లి
తెలంగాణ సాయుధ పోరాట యోధులు ముదిరెడ్డి లింగారెడ్డి మృతికి సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశ్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, కె.నాగిరెడ్డి, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హషం, లక్ష్మీనారాయణ, బి.వెంకట్, మల్లు లక్ష్మీ, బీఎల్ఆర్ బ్రదర్స్, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, మాజీ ఉప ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, ఎరుకాల వెంకన్న, ఆ గ్రామ సర్పంచ్ ఎర్ర కన్నయ్య, మాడ్గులపల్లి మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, పుల్లెంల శ్రీకర్, కెేవీపీిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెమిడాల పరుశరాములు, గంజి మురళీధర్ సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.మృతుునికి ఇద్దరు కుమారులు ముదిరెడ్డి రామిరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కూతురు కట్టా లక్ష్మమ్మ ఉన్నారు.