Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ:అభాగ్యులకు అండ సీఎం సహాయ నిధి మారిందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 42 మందికి రూ.30.25 లక్షల చెక్కులను బాధితులకు ఆయన మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, బాలు నాయక్, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు వైస్ చైర్మన్ రహత్ అలీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కృష్ణయ్య, లోకసాని తిరపతయ్య, వెలుగురి వలపు రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి,అర్వపల్లి నర్సింహ, పొన్నబోయిన సైదులు,మూడవత్ జయప్రకాష్,వేముల రాజు పాల్గొన్నారు.