Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్ర బడ్జెట్ నామ మాత్రంగా ఉంది.గతేడాది 34 లక్షలా 83 వేల కోట్ల బడ్జెట్టు ప్రవేశపెట్టగా ఈసారి దానికి 11 శాతం పెంచారు. గతేడాదితో పోలిస్తే 11 నుండి 12 శాతం బడ్జెట్ పెరుగుదల ఉందని కానీ, ఇప్పుడున్న ద్రవ్యోల్బణం 7 శాతం తీసేస్తే ఇది నామమాత్రపు బడ్జెట్ అని చెప్పొచ్చు.ఈ బడ్జెట్లో భిన్నమైన విధానాలు అమలు చేయలేదు. ప్రభుత్వ, ప్రయివేట్రంగాలకు బడ్జెట్కేటాయింపులు నామమాత్రమే. ప్రస్తుతం దేశం ఆర్థిక మాన్యం ద్రవ్యోల్బణం సమస్యలు ఎదుర్కొం టోందని ఈ పరిస్థితుల్లో ప్రజల జీవితాలు అతలాకు తలమవుతున్నాయి. మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఆదాయ పన్నులో రిబేట్ ఏమీ లేదు. ఉద్యోగస్తులకు రావాల్సిన 3డీఏ లను ఎగవేశారు.కరోనాతో పేద, మధ్యతరగతి, ఉద్యోగుల్లో కొనుగోలు శక్తి తగ్గినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సూచించలేదు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఆహారధాన్యాలను కేంద్రం కొనుగోలు చేస్తే బాగుంటుంది.