Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దశ దిశ లేదు. ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయం, విద్యారంగం, ఆరోగ్య శాఖలతోపాటు గ్రామీణ రంగాన్ని పూర్తిగా విస్మరించింది. బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నా ఖర్చు చేయడం లేదన్నారు. ఉపాధిహామీ పథకానికి క్రమంగా నిధులను తగ్గిస్తున్నారు. పంటలకు మార్కెట్ సౌకర్యం, ప్రభుత్వం మద్దతు ధర ప్రస్తావన లేదు. ధరల నియంత్రణపై ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటు. జిల్లాలో ఉన్న నిమ్స్ వైద్యశాలకు తగిన నిధులు కేటాయించలేదు. మొత్తంగా పరిశీలిస్తే కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ఉంది.