Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ :బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్‌పై చేస్తున్న అసత్య ఆరోపణలను ఎమ్మార్పీఎస్ టీఎస్, దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ముదిగొండ ఎల్లేష్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. అలాంటి మహా నాయకుడిపై అవాకులు చవాకులు పేలిస్తే సహించేది లేదన్నారు. దేవరకొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, తెలంగాణ మాదిగ దండోరా దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు నాగిళ్ల రవి, ఎంఈఎఫ్ టీఎస్ జిల్లా నాయకులు దర్శనం శివ, చందంపేట మండల్ అధ్యక్షులు అందువల్ల సైదులు, దళిత జేఏసీ జిల్లా అధ్యక్షులు ముదిగొండ సాగర్, పీఏపల్లి మండల అధ్యక్షులు రమణపల్లి వెంకటయ్య, చింతపల్లి మండల అధ్యక్షులు ముదిగొండ శేఖర్, మల్లెపల్లి మండల నాయకులు గడ్డం నగేష్ పాల్గొన్నారు.