Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రాధాన్యత కల్పించలేదు.బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని ఫణంగా పెట్టింది.ఉపాధి హామీ చట్టానిక గతేడాది పెట్టిన ఖర్చుతోపోలిస్తే దాదాపు నాల్గోవంతు కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.98 వేలకోట్లు ఈ చట్టం కింద ఖర్చు చేసినట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడిస్తుంటే 2022-23 ఆర్థికసంవత్సరానికి కేవలం రూ.73 వేల కోట్ల రూపాయలకు తగ్గించింది. అమత్ పథకానికి తదనుగుణంగా కేటాయింపులు లేవు.పట్టణ ప్రాంత పేదలకు ఇచ్చే వడ్డీ రాయితీల్లో కోత విధించటం సరికాదు.దేశంలోని అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచే విధంగా బడ్జెట్ ఉంది. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఊసే లేదు. దేశంలో వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం వాటిని ప్రోత్సహించే విధంగా,మద్దతు ధర చెల్లించే విధంగా బడ్జెట్ కేటాయింపులు లేవు.ధరల స్థిరీకరణ నిధి గురించి ప్రస్తావన లేకపోవడం దారుణం.కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్యాన్ని అందించడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం బడ్జెట్లో ఊసే లేదు.మధ్యతరగతి ప్రజలకు,వేతన జీవులకు ఆశించిన స్థాయిలో రాయితీలు కల్పించలేదు.ఆహారం, ఆయిల్,ఎరువులపై సబ్సిడీని పూర్తిగా తగ్గించి పెట్టుబడిదారులకు కార్పొరేట్శక్తులకు రాయితీలు పెంచడం అన్యాయం.బడ్జెట్లో రాబడి తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉండడంతో ఇది అప్పులతో కూడిన బడ్జెట్ చెప్పొచ్చు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టనట్టుగా ఉంది.