Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :గ్రామాల్లోనినర్సరీలలో షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశం హాల్లో జరిగిన మిర్యాలగూడ డివిజన్ ఎంపీఓలు, ఉపాధి హామీ పథకం ఏపీఓల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలలోని నర్సరీలలో షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న పంచాయతీలకు షేడ్ నెట్లు ఏర్పాటుకు చర్యలు తీసు కుంటామని తెలిపారు. నర్స రీలలో బ్యాగుల్లో మట్టి నింపడం, అనంతరం విత్తనాలు నాటడం, విత్తనాలు మొలకెత్తేలా వంద శాతం చేయాలని ఆదేశించారు. నర్సరీలలో పశువుల పేడ వేయాలని, సక్రమంగా నీళ్లు పోయాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల పన్నుల వసూళ్లు ముమ్మరం చేయాలని కోరారు.మాడుగులపల్లి మండలం కుక్కడం పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామన్నారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మీ, జిల్లా గ్రామీణాభివృద్ధి ఏపీడీలు శైలజ,నాగయ్య పాల్గొన్నారు.