Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్ :నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైదా రవీందర్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 3,4,5,7, 18 వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయ కులు పన్నాల రాఘవరెడ్డి, గార్లపాటి రవీందర్రెడ్డి, చింతల శ్రీనివాస్, వంటేపాక నాగయ్య, గోగికార్ పరమేష్, అబ్దుల్ మజీద్, ఎండీ.యూసుఫ్, ధనమ్మ , వంటేపాక సతీష్ , రాజశేఖర్, వంటేపాక నక్షత్, పందిరి సతీష్ పాల్గొన్నారు.