Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
పనిచేసే అధికారులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల పదోన్నతిపై బదిలీ అయిన ఎంపీడీవో సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగి రమేష్‌కు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఎంపీడీవోగా సాంబశివరావు కృషి అభినంద నీయమన్నారు. జీవ రాసుల కోసం ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారని అభినందించారు. రామ్మోహన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించి జిల్లాలో నే చెరువుగట్టుకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చారన్నారు. నాలుగో తరగతి ఉద్యోగి రమేష్ నిత్యం అందుబాటులో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుండగొని యాదగిరిగౌడ్, కార్యాలయ పర్యవేక్షణ అధికారి ప్రదీప్ కుమార్, మండల పరిషత్ పంచాయతీ అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.