Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల బిల్లులను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్ లో భవన నిర్మాణ కార్మికుల మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశం మేడి యాదయ్య అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నిర్మాణరంగ కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డ్ కేంద్ర చట్టం 1996ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికుల పొట్ట కొట్టిందని విమర్శించారు.దానిని పునరుద్ధరించేకపోతే దేశవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం అవుతారని హెచ్చరించారు. రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు లో రెండు వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నా కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి 7500 రూపాయలు సహకారం అందించమంటే కేసీఆర్ సర్కార్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను పలహారంలాగా మంచి పెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా దారి మళ్లించిన వెయ్యి కోట్ల రూపాయలను వెంటనే బోర్డులో జమ చేయాలని కోరారు. 57 సంవత్సరాల పైబడిన నిర్మాణ రంగ కార్మికులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చాపల మారయ్య, సీఐటీయూ మండల కన్వీనర్ యాసరాని శ్రీనివాస్, వరికుప్పల ముత్యాలు, యాసరాని వీరయ్య, దర్శనం కృష్ణ, పగడాల కాంతయ్య, బోయ లింగయ్య, దొరె వెంకన్న, జీడిమెట్ల సైదులు, అశోక్ పాల్గొన్నారు.