Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఉపాధి అవకాశం కల్పనకు యువతలో వత్తి నైపుణ్యతపై ప్రత్యేక తర్ఫీదు కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు. మంగళ వారం కలెక్టరేట్ నందు ఉపాధి కల్పనాధికారి మాధవరెడ్డి అధ్యక్షతన సంకల్ప పథకంకు సంబంధించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను లక్ష్యంగా ఎంచుకొని వత్తి నైపుణ్యతపై శిక్షణా, అవగాహనా తరగతులు చేపట్టాలన్నారు.సదస్సుల అనంతరం వారిలో ఉన్న నైపుణ్యతను గుర్తించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు.జిల్లాలో గల అధికారులు,ఉద్యోగులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.వివిధ రకాలైన స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలపై చర్చించారు.జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధిఅవకాశాల కల్పనకు కావాల్సిన స్కిల్‌ను అందించి ఉపాధి కల్పించే ఉద్దేశంతో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్,డీఎం పరిశ్రమలు తిరుపతయ్య,డీఏఓ రామారావునాయక్, గిరిజన సంక్షేమాధికారి శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.