Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించినట్లు మాల మహానాడు రాష్ట్ర నాయకురాలు గాజుల పున్నమ్మ తెలిపారు. మున్సిపాలిటీపరిధిలోని చింతబండ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహా నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి హాజరై మాట్లాడారు. హక్కులు కల్పించడంతో పాటు చట్టసభల్లో హోదా కల్పించిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు.ఆయన విగ్రహాన్ని మహిళలు పెట్టడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంసాయి, మాజీఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, నాగండ్ల శ్రీధర్, కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్, రణపంగ నాగయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, ఎడ్ల సైదులు, ఎస్సీ ఉద్యోగస్తుల సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్, నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతంసత్యనారాయణరెడ్డి, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్తిపాటి విజరు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పాల్వాయి రమేష్, మాలమహానాడు రాష్ట్ర నాయకులు పెరుమాళ్ల ధనమ్మ, కోడిరెక్క చిన్నప్ప, బాలవెంకటేశ్వర్లు, వాస కర్నాకర్ పాల్గొన్నారు.