Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జమ్మిగడ్డలో అనేక దశాబ్దాల కాలం నుండి నివసిస్తున్న నిరుపేదలకు, సమాజంలో అట్టడుగు వర్గాలైన బైండ్ల కులస్తులకు పుల్లారెడ్డి చెరువు పక్కన వున్న ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్ధలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మాదివెంకటేశ్వర్లు కోరారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని జమ్మిగడ్డలో పుల్లారెడ్డిచెరువు పక్కన వున్న ప్రభుత్వ భూమిలో పార్టీ అధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్ల వుతున్నప్పటికీ బైండ్ల కులానికి చెందిన పేదలు స్వంత ఇండ్లు లేక,వారికి ఎవ్వరూ ఇండ్లు కిరాయికి ఇవ్వకపోవడం ద్వారా చెట్ల కింద తలదాచుకుని జీవిస్తున్నారన్నారు.కుల వత్తి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి అడుగడుగునా నివాసప్రాంతాల్లో కులవివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బాణామతి, మంత్రాలనెపంతో అవమానాలకు గురిచేస్తున్న తట్టుకొని సమాజంలో బతుకుతున్నారని తెలిపారు.జీవనపోరాటంలో సామాజిక వివక్ష ఒక పక్క, మరో పక్క నివాస ప్రాంతాల్లో జరుగుతున్న అవమానాలతో మింగలేక కక్కలేక బతుకీడుస్తున్న బైండ్లను ఆదుకోవాలని కోరారు.జిల్లాకేంద్రంలో పలుచోట్ల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమిస్తున్నారని, కులవృత్తిని నమ్ముకుని జీవితం గడుపుతున్న పేదలకు ప్రభుత్వం వెంటనే కుటుంబానికి 100 గజాల ఇంటి స్ధలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శులు ఎల్గూరి గోవింద్,కోట గోపి,బైండ్ల కులస్తులు పడిసిరి వెంకన్న, కందుకూరి శివ,కందుకూరి రవి, కారంపూడి వెంకన్న, కందు కూరి వెంకన్న,చినపంగు జనార్దన్, కమలమ్మ, ఎల్లమ్మ, పడిసిరి వెంకటమ్మ,సైదులు పాల్గొన్నారు.