Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్వే నోటిఫికేషన్లో చాలా తప్పుదొర్లాయని, వాటిని సరిచేయాలని కోరుతూ గురువారం గ్రామ ఎంపీటీసీ శారద ఆంజనేయులు యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామంలోని ఇండ్ల నిర్వాసితులకు స్లాబు ఇండ్లకు బదులుగా పెంకుటిల్లు అని, ఒక ఇంట్లో బోరు బావి ఉంటే రికార్డుల్లో రాకపోవడం , ఖాళీ స్థలం ఉంటే రాకపోవడం సర్వేలో రాయించుకున్న కూడా నోటిఫికేషన్లో రాకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపాలను సరిదిద్ది అందరికి న్యాయం చేయాలని కోరారు.