Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్టీసీ డీఎం రాజీవ్ ప్రేమ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం డీఎం కార్యాలయంలో దేవరకొండ, కొండమల్లేపల్లి, మాల్ బస్ స్టేషన్లలో నిర్వహిస్తున్న వివిధ స్టాల్స్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాల్స్ నిర్వాహకులు నిబంధనల మేరకు బ్రాండెడ్ వస్తువులు విక్రయించాలని, అదేవిధంగా ఎంఆర్పీ ధరలకే అమ్మాలన్నారు. లైసెన్స్‌లో సూచించిన ప్రకారం అవే వస్తువులు అమ్మాలని, కేటాయించిన స్థలంలోనే నడపాలన్నారు. ప్రతి నెలా రెంట్స్ 10వ తేదీ లోపు చెల్లించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి స్టాల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆఫీసు సూపరింటెండెంట్ రాఘవేంద్ర రావుతో పాటు, స్టాల్ నిర్వాహకులు పాల్గొన్నారు