Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్ పల్లి
మండలంలో పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు గురువారం జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు, మొదట అక్కేనపల్లిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి నక్కలపల్లిలో శ్రీ భక్తఆంజనేయ దేవాలయంలో నిర్వహించిన పూజలకు హాజరయ్యారు, అనంతరం బెండల్‌పహాడ్, పల్లెపహాడ్‌లో సీసీ రోడ్డు పనులు, వైకుంఠదామాన్ని ప్రారంభించారు. బాజకుంట, అమ్మనబోలులో సీసీ రోడ్డు పనులు, పల్లెప్రకతి వనం, వైకుంఠదామాన్ని ప్రారంభించారు.
సీఎంఆర్ఎఫ్, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ
మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన మంద వెంకటేష్, వంగాల మల్లేష్, కొమ్ము యాదగిరి, పల్లెపహాడ్ గ్రామానికి చెందిన నర్రాముల నిర్మల అనారోగ్యంతో చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన రూ.2 లక్షల చెక్కులను అందించారు. అలాగే అమ్మనబోలు గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బోడ ప్రవీణ్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారికి పార్టీ ప్రమాదబీమా ద్వారా మంజూరు అయిన రూ.2 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ మధుసుధన్‌రెడ్డి , నార్కట్ పల్లి ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, అక్కెనపల్లి ఎంపీటీసీ చిర్రబోయిన సావిత్రి కుమారస్వామి, బెండల పహాడ్ గ్రామ సర్పంచ్ ఎడమ శేఖర్‌రెడ్డి, పల్లె పహాడ్ గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి , బాజకుంట గ్రామ సర్పంచ్ సరిత రవీందర్ రెడ్డి, అమ్మనబోలు గ్రామ సర్పంచ్ బద్దం వరమ్మ రాంరెడ్డి పాల్గొన్నారు.