Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
18ఏండ్లు పైబడిన వారికి ఈ శ్రమ్ కార్డులు తప్పనిసరని ఎంపీవో సలీం అన్నారు గురువారం మండలంలోని. శ్రీనివాసపురంలో ఈ శ్రమ్ కార్డ్ నమోదుచేసుకున్న లబ్దిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, హెల్త్ కార్డ్, ఆపత్కాలంలో ఆర్థిక సహాయం, ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, విబికె మంజుల, దూడల భాస్కర్, లక్ష్మి నర్సమ్మ, స్వామి, నీరజ, రేఖ తదితరులు పాల్గొన్నారు