Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ-చిలుకూరు
గత పాలకుల కాలంలో సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సహకార సంఘంలో రూ.50 లక్షల వ్యయంతో నూతన సహకార సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సహకార సంఘాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. రైతులకు అండదండగా సహకార సంఘాలు నిలుస్తాయన్నారు. సహకార సంఘాలు రైతులకు నిరంతరం దీర్ఘకాలిక , స్వల్పకాలిక రుణాలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నాయన్నారు. పీఏసీఎస్ చైర్మెన్్ అలస కానీ జనార్దన్ అధ్యక్షతన నిర్వహించినీ కార్యక్రమంలో జిల్లా సొసైటీ డైరెక్టర్ కొండ సైదయ్య ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య ,జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు జానీమియా, చిలుకూరు మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ సురేష్ గ్రామ సర్పంచ్ కోడారు వెంకటేశ్వర్లు స్వతంత్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు పాల్గొన్నారు.